
కామారెడ్డి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఆదివారం (సెప్టెంబర్ 07) కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలోని బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ను మంత్రులు తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం, సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నిరంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, స్కూల్ పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.