
హైదరాబాద్, వెలుగు: సిటీలో స్కూళ్లలో 6 నుంచి 8 వరకు డైరెక్ట్ క్లాస్ లు షురూ అయినప్పటికీ స్టూడెంట్స్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. వారం రోజులైనా అటెండెన్స్ పెరగ లేదు. హైదరాబాద్ జిల్లాలో 189 గవర్నమెంట్ స్కూల్స్ లో 26, 132 మంది స్టూడెంట్స్ ఉండగా, సోమవారం 1,855 మంది మాత్రమే హాజరయ్యారు. 1,769 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 6,7,8 తరగతుల్లో 1,81,758 మంది స్టూడెంట్స్ చదువుతుండగా, ఇందులో 32,622 మంది మాత్రమే క్లాసులకు అటెండ్ అయ్యారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో సోమవారం అటెండెన్స్ 16 . 58 శాతమేనని డీఈఓ రోహిణి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు స్టూడెంట్స్ ను పంపించేందుకు పేరెంట్స్ ఇష్టపడడం లేదని అన్నారు.