ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని రోడ్లు ఊడ్చిన స్టూడెంట్స్

ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని  రోడ్లు ఊడ్చిన స్టూడెంట్స్

ఖమ్మం టౌన్, వెలుగు : పెండింగ్​లోని స్కాలర్​షిప్స్, ఫీజు రీయింబర్స్​మెంట్స్​ ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం నగర కేంద్రంలోని పాత బస్టాండ్ కమల మెడికల్ వద్ద స్టూడెంట్స్​ రోడ్లు ఊడుస్తూ, బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. .

ఈ సందర్భంగా ఎస్​ఎఫ్​ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పూర్తిగా కళాశాలలు బంద్ చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా పెండింగ్​లోని స్కాలర్​ షిప్స్​ను వెంటనే విడుదల చేసి, విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు త్రినాథ్ రాజు, ఉపాధ్యక్షుడు లోకేశ్, నాయకులు భరత్, సింధు, సాత్విక, త్రివేణి, శ్రావ్య, నందిని, సింధుజ, ధరణి, త్రివేణి, కావ్య పాల్గొన్నారు.