
డ్రగ్స్ నిర్ములనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు, మెరుపు దాడులతో డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేస్తోంది ఈగల్ టీం. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు నార్కొటిక్ అధికారులు. అయినప్పటికీ డ్రగ్స్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. అధికారుల కళ్లు గప్పి ఎక్కడో ఓ చోట డ్రగ్స్ వాడకం జరుగుతూనే ఉంది.
లేటెస్ట్ గా ఆగస్టు 25న తెలంగాణ యాంటీ నార్కొటిక్ డీసీపీ సైదులు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ కుత్బుల్లాపూర్ బహదూర్ పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ లో తనిఖీలు చేసింది. పక్కా సమాచారంతో యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తనిఖీలు చేపట్టారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు. 14 మంది విద్యార్థులను పరీక్షించగా అందులో ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. 50 మంది విద్యార్థులను దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్ల, సూరారంలోని శివాలయం కాలనీలో దాడి చేసిన ఈగల్ టీం.. నలుగురు నేవెళ్ల టంగ్ బ్రమ్, అంబటి గణేశ్, బూస శివకుమార్, మహమ్మద్ ఆషర్ జావెద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు అధికారులు. వారి నుంచి 1.15 కిలోల గంజా, 47 గ్రాముల OG వీడ్, డ్రగ్ ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మిషన్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీ మారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ అయిన రాజేష్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా డ్రగ్ పార్శిల్స్ బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బీదర్ నుంచి డ్రగ్స్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నైజీరియన్ డ్రగ్ సరఫరాదారుడిగా నిక్ అనే వ్యక్తి మహీంద్రా యూనివర్సిటీలోని భాస్కర్, దినేష్ అనే విద్యార్థులుతో సంబంధం పెట్టుకుని MDMA టాబ్లెట్లు కొనుగోలు చేసి ఇతర విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈగల్ రైడింగ్ లిస్టులో సింబయాసిస్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT), IIIT బాసరా, JNTU జోగిపేట, ICFAI, ఉస్మానియా యూనివర్సిటీ లు ఉన్నవి