ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు .. ఉన్నత విద్యామండలి చైర్మన్కు వినతి

ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు .. ఉన్నత విద్యామండలి చైర్మన్కు వినతి

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్​కాలేజీల్లో ఫీజులు పెంచొద్దని వర్సిటీ స్టూడెంట్స్​ప్రొటెక్షన్​ ఫోరం డిమాండ్​ చేసింది. ఈ మేరకు ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్​ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్యాలు ఫీజులు పెంచకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.