రెండేండ్లు చదివితే లోకలే

రెండేండ్లు చదివితే లోకలే
  • తెలంగాణ కోటా 25%
  • మిగతా కోటాలు ఉండవు
  • అనుమతులకుఎక్స్​పర్ట్స్​ కమిటీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌తో మంగళవారం విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డి జీవో ఇచ్చారు. ఈ యూనివర్సిటీల్లోని అన్ని కోర్సుల్లో 25 శాతం సీట్లను స్థానికులకే రిజర్వ్‌‌ చేశారు. అయితే ‘లోకల్‌‌’కు ప్రభుత్వం కొత్త నిర్వచనమిచ్చింది. తెలంగాణలో కనీసం రెండేడ్లు చదివిన స్టూడెంట్స్‌‌ను లోకల్‌‌గా పరిగణించాలని జీవోలో చెప్పారు. అలాగే ఇక్కడ కనీసం రెండేళ్లు పనిచేసిన వ్యక్తుల పిల్లలు కూడా స్థానికులుగా ప్రైవేటు యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకోవచ్చని వివరించారు. వర్సిటీల అడ్మిషన్లలో రిజర్వేషన్లు ఉండవని, రాష్ట్రానికి చెందిన స్టూడెంట్లకు 25 శాతం సీట్లివ్వాలని గైడ్‌‌లైన్స్‌‌లో వెల్లడించారు. ఫీజులు, ఫ్యాకల్టీ నియామకంపై మాత్రం  స్పష్టత లేదు.

హెచ్‌‌ఎండీఏలో 20 ఎకరాలుంటే చాలు

వర్సిటీ ఏర్పాటుకు హెచ్‌‌ఎండీఏ పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 30  ఎకరాల భూమి ఉండాలని మార్గదర్శకాల్లో సర్కారు పేర్కొంది.  ఆ భూమి తప్పనిసరిగా సొసైటీ పేరుతో రిజిస్టరై ఉండాలని చెప్పింది. వర్సిటీ అడ్మినిస్ర్టేషన్‌‌ బిల్డింగ్‌‌ వెయ్యి చదరపు అడుగులు, అకడమిక్‌‌ బిల్డింగ్‌‌ (లైబ్రరీ, లెక్చర్‌‌ హాల్స్‌‌, లేబోరేటరీస్‌‌) పది వేల చదరపు అడుగుల్లో ఉండాలని పేర్కొంది. రూ.50 వేల దరఖాస్తు ఫీజు చెల్లించాలని, వర్సిటీ ప్రారంభించేటప్పుడు రూ.10 కోట్లు కార్ఫస్‌‌ ఫండ్‌‌ డిపాజిట్‌‌ చేయాలంది. వర్సిటీ నిర్మాణాలు, ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్‌‌, క్యాంపస్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కోసం ముందే రూ.30 కోట్ల ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్‌‌ చేయాలని పేర్కొంది. దీంతో పాటు మరో రూ.10 కోట్ల ఎండోమెంట్‌‌ ఫండ్‌‌ డిపాజిట్‌‌ చేయాల్సి ఉంటుందని వివరించింది.

ఏడుగురితో ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఏడుగురితో ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్స్‌‌ ఆఫిషియో చైర్మన్‌‌గా ప్రభుత్వ కార్యదర్శి/ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ/ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ, మెంబర్‌‌ సెక్రటరీగా కళాశాల విద్యా శాఖ కమిషనర్‌‌, సభ్యులుగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌, జేఎన్‌‌టీయూ,

ఫీజులు, ఫ్యాకల్టీపై నో క్లారిటీ

వర్సిటీ అడ్మిషన్లలో 25 శాతం లోకల్‌‌ స్టూడెంట్లకు రిజర్వేషన్‌‌ కల్పిస్తున్నట్టు ప్రకటించినా ఫ్యాకల్టీ విషయంలో మాత్రం లోకలోళ్లకు అవకాశముంటుందో లేదో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఫీజులను ఎవరు నిర్ణయిస్తారు, నియంత్రణ అధికారం ప్రభుత్వానికి ఉంటుందో లేదో క్లారిటీ లేదు. దీంతో ఏ ప్రాంతం నుంచైనా ఫ్యాకల్టీని రిక్రూట్‌‌ చేసుకోడానికి సర్కారు అనుమతించినట్లైంది. పైగా ఫీజులనూ వర్సిటీ నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది. కాబట్టి ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులు ఎక్కువుండే చాన్స్‌‌ ఉంది.  (మొదటి పేజీ తరువాయి)

ఓయూ వీసీలతో పాటు ఇద్దరు ప్రముఖులు ఉంటారు. వర్సిటీ కోసం దరఖాస్తు వచ్చిన 60 రోజుల్లో ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ కమిటీ పరిశీలించి సర్కారుకు నివేదికివ్వాలి. దానికి అనుమతికి సంబంధించి 30 రోజుల్లో ప్రభుత్వం సమాధానమిస్తుంది. ఇంకేమైనా వివరాలు కావాలంటే అడుగుతుంది. వర్సిటీ ఏర్పాటైన మూడేండ్ల పాటు 6 నెలలకోసారి, తర్వాత ఏటా అకడమిక్‌‌‌‌ వివరాలను సర్కారుకు వివరించాలి. టీచింగ్‌‌‌‌, ఎగ్జామినేషన్స్‌‌‌‌, రీసెర్చ్‌‌‌‌ అంశాలను తనిఖీ చేసేందుకు సర్కారు అధికారం ఉంటుంది.

‘ప్రైవేటు’కు ఉత్సాహం

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు కార్పొరేట్‌‌‌‌ సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలూ ఆసక్తి చూపిస్తున్నాయి. రిలయన్స్‌‌‌‌ సంస్థ రెండేండ్ల కిందే రాష్ట్రంలో వర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నించగా వర్సిటీ చట్టం లేక సర్కారు చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ సంస్థ వర్సిటీ పెట్టే అవకాశముంది. ఇక స్కిల్డ్‌‌‌‌ వర్సిటీ, స్పోర్ట్స్‌‌‌‌ వర్సిటీలు పెట్టేందుకు కొన్ని కార్పొరేట్‌‌‌‌ సంస్థలు ఇప్పటికే సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్నాయి.