బెల్లంపల్లిలోని జ్యోతిబాపూలే స్కూల్ ప్రిన్సిపాల్ వేధిస్తోంది..తల్లిదండ్రులకు విద్యార్థుల లేఖ

బెల్లంపల్లిలోని జ్యోతిబాపూలే స్కూల్ ప్రిన్సిపాల్ వేధిస్తోంది..తల్లిదండ్రులకు విద్యార్థుల లేఖ

బెల్లంపల్లి, వెలుగు: ప్రిన్సిపాల్​ తమను వేధిస్తోందని బెల్లంపల్లిలోని జ్యోతిబాపూలే స్కూల్ టెన్త్​విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తల్లితండ్రులకు లెటర్​ రాయడం స్థానికంగా సంచలనంగా మారింది. తల్లితండ్రులంగా గదుల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడంలేదని ప్రిన్సిపాల్​రమాదేవికి చెబితే డబ్బులు అడుగుతోందని.. మీరంతా రైతు బిడ్డలు, మీకెందుకు ఇవ్వన్నీ అంటూ హేళనగా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వేధిస్తోందని ఆరోపించారు. 

‘మీరు విలేకర్లను తీసుకుని పాఠశాలకు వస్తే తమ సమస్యలు తెలియచేస్తాం’ అని లేఖలో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో పోచయ్య స్పందించారు. వెంటనే స్కూల్​ను సందర్శించి సమస్యలను పరిశీలిస్తామన్నారు. విద్యార్థుల సమస్యలు వాస్తవమని తేలితే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు.