సర్వే రిపోర్ట్ : ఉద్యోగానికి పనికిరాని చదువులు

సర్వే రిపోర్ట్ : ఉద్యోగానికి పనికిరాని చదువులు

మనదేశంలో చదువుకున్న వాళ్లలో నైపుణ్యం తక్కువని ఇటీవలి అధ్యయనాలు చెప్తు న్నాయి. సమాజం మారుతు న్న కొద్దీ విద్యా విధానంలో మార్పులు రావాలి. అందుకు తగ్గట్లే టెక్నికల్‌ కోర్సులు పెరుగుతున్నాయి. వాటిని చదువుకుంటు న్న విద్యార్థులూ పెరుగుతున్నారు. కానీ, వాళ్లలో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు మాత్రం సరిగా ఉండటంలేదని తేలింది. దీనిని గుర్తించి మనదేశంలో 2009లోనే జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానాన్ని ఏర్పాటు చేశారు. అవసరాలకు  తగ్గట్లు 2015లో దీనిలో మార్పులు చేశారు. 2022 నాటికి యాభై కోట్ల మందికి నైపుణ్యం అందిం చాలన్నది దీని లక్ష్యం.

వృత్తి విద్యల్లో నైపుణ్యాలు పెంచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందిం చడం కోసం ఇది రూపొందిం చబడింది. గ్లోబల్‌ మార్కెటిం గ్‌ కు తగ్గట్లు విద్యార్హతతో పాటు, నైపుణ్యాభివృద్ధికోసమే ఈ విధానం. దీని  ప్రకారం ఒకవైపు వృత్తివిద్యను ప్రోత్సహిస్తూ మరోవైపు సాంకేతిక విద్యనూ నేర్పించాల్సిన అవసరం ఉంది. 2030 నాటికి ఈ లక్ష్యాలు సాధించాలన్నదే కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ టార్గెట్.