యూకేలో స్టూడెంట్లకు మ్యాథ్స్  కంపల్సరీ

యూకేలో స్టూడెంట్లకు మ్యాథ్స్  కంపల్సరీ

యూకేలో స్టూడెంట్లకు మ్యాథ్స్  కంపల్సరీ
18 ఏండ్లు వచ్చే వరకూ తప్పదు
పీఎం రిషి సునక్  ఆఫీస్  ప్రకటన

లండన్ : యూకేలో స్టూడెంట్లందరికీ ఇకపై మ్యాథ్స్  అధ్యయనం కంపల్సరీ కానుంది. ఈ ఏడాది నుంచి విద్యార్థులు తమకు18 ఏండ్లు వచ్చేదాకా  మ్యాథ్స్  స్టడీ చేయాల్సిందేనని పీఎం రిషి సునక్  కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి స్టూడెంట్​కు అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తన ప్రాధాన్యమని సునక్  ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీ అమలు దిశగా ఆయన ప్రభుత్వం అడుగులు వేయనుంది. ‘‘సరైన ప్లానింగ్, కమిట్ మెంట్ తో ప్రపంచంలో అత్యన్నతమైన విద్యా వ్యవస్థను సాధించవచ్చు. ఆ విషయంలో నాకెలాంటి డౌట్  లేదు” అని సునక్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం యూకేలో 16 నుంచి 19 ఏండ్ల మధ్య సగం మంది మాత్రమే మ్యాథ్స్  చేయగలుగుతున్నారు. ఇక్కడి స్టూడెంట్లలో 60 శాతం మందికి బేసిక్  మ్యాథ్స్ పై పట్టు లేదు.