సంగారెడ్డి జిల్లా చేర్యాల ఎక్స్‌‌‌‌‌‌‌‌రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన లారీ.. ఎస్సై మృతి

సంగారెడ్డి జిల్లా చేర్యాల ఎక్స్‌‌‌‌‌‌‌‌రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన లారీ.. ఎస్సై మృతి
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎస్సైగా పనిచేస్తున్న రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌

సంగారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కారును లారీ ఢీకొట్టడంతో ఓ ఎస్సై చనిపోయాడు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా చేర్యాల ఎక్స్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డికి చెందిన ఎం.రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఫిల్మ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా బుధవారం రాత్రి బందోబస్తు డ్యూటీ చేసిన రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌.. విధులు ముగిసిన తర్వాత కారులో సంగారెడ్డిలోని తన ఇంటికి వెళ్తున్నాడు.

అర్ధరాత్రి 1.30 గంటల టైంలో సంగారెడ్డి రూరల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని చేర్యాల ఎక్స్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వద్దకు రాగానే లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఎస్సైని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ వద్ద సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ రామరావు నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.