
కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ పై సస్పెన్షన్ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కొత్తపల్లిలోని సర్వే నంబర్ 272/14లో నిబంధనల విరుద్ధంగా 9 రిజిస్ట్రేషన్లు, సర్వే నంబర్లు 175, 197, 198 లోసీలింగ్ భూములను 476 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు.
లోక్ సత్తా అప్పటి అధ్యక్షుడు దివంగత నరేడ్ల శ్రీనివాస్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో మే నెలలో ఈ సీలింగ్ భూముల రిజిస్ట్రేషన్ లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రద్దు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో గంగాధర, తిమ్మాపూర్, కరీంనగర్, హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దర్యాప్తు చేశారు అధికారులు.. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ ఆదేశంతో నూర్ అఫ్జల్ ఖాన్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ మేరకు కరీంనగర్ డీఐజీ ఎం.రవీందర్ చేత సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అఫ్జల్ ఖాన్ ప్లేసులో సీనియర్ అసిస్టెంట్ పి.సదాశివ రామకృష్ణకు గంగాధర సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించారు.