
నాగర్ కర్నూల్ జిల్లా: గత రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ పంప్ హౌస్ లోకి వరద నీరు చేరింది. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామ శివారులోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పంప్ హౌస్ నీట మునిగింది. వట్టెం నుంచి వరద నీరు టన్నెల్, సర్జికల్, పంప్ హౌస్ లకు చేరింది. అధికారులు నీటిని తోడుతున్నారు. పూర్తిగా నీటిని తీసేస్తేనే ఎంత మేరకు నష్టం వాటిల్లిందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటి బయటకు తీసే పనులు జరుగుతున్నాయి. టన్నెల్ లోకి మట్టి, నీరు చేరింది.