చెన్నూరు ఉత్తరవాహిని గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.శనివారం (ఏప్రిల్ 04) మంచిర్యాల జిల్లా పజ్యటనలో భాగంగా 2027లో జరిగే పుష్కరాల్లో భాగంగా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్, ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి..పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
మంత్రి వివేక్ కామెంట్స్ :
- ఉత్తరవాహిని గోదావరి పుష్కరాల నిర్వహణ అంశం కేబినెట్ లో చర్చించాం
- అధిక నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాము
- సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేశారు
- చెన్నూరు ప్రాంతం టైర్ 2 లో ఉంది. ఎక్కువ నిధులకోసం టైర్ 1 కి మార్చాలని కోరాను.
- సీఎం వెంటనే స్పందించి చెన్నూరు ప్రాంతాన్ని టైర్ 1 కి మార్చారు.
- పుష్కరాల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది.
- పుష్కరాలకు ప్రతిరోజూ సుమారు లక్ష మంది వస్తారని అంచనా
- దానికి అనుకూలంగా రోడ్లు, టాయిలెట్స్, అన్ని రకాల సదుపాయాల ఏర్పాట్లు
- నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కు కృతజ్ఞతలు
