సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే పాస్‌పోర్ట్ ఇవ్వరట

సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే పాస్‌పోర్ట్ ఇవ్వరట

ఉత్తరాఖండ్ పోలీసుల నిర్ణయం

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే వారి సోషల్ మీడియా అకౌంట్లను కూడా చెక్ చేయాలని ఉత్తరాఖండ్ పోలీసులు నిర్ణయించారు. ఇక నుంచి ఎవరైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే.. ఎంక్వైరీలో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను కూడా తనిఖీ చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ పద్దతి ద్వారా సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తగ్గించొచ్చని ఆయన అన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి పాస్‌పోర్ట్ ఇవ్వకూడదని పాస్‌పోర్ట్ చట్టంలో ఉంది. ఆ నిబంధనను అమలు చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘సోషల్ మీడియాలో కొంతమంది పెట్టె పోస్టుల వల్ల అలర్లు, గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కూడా సోషల్ మీడియా ఒక కారణంగా చెప్పొచ్చు. గతంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులపై ఏమైనా కేసులున్నాయా? అని మాత్రమే ఎంక్వైరీ చేసేవారు. కానీ, ఇక నుంచి సోషల్ మీడియా ఖాతాలను కూడా చెక్ చేయాలని నిర్ణయించాం’ అని డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.

For More News..

ప్రేమ పేరుతో గర్భం.. అబార్షన్ చేయమంటే ఏకంగా గర్భసంచే తొలగించిన వైద్యుడు

డెలివరీ పేరుతో దోపిడీ.. పట్టించుకోని గ్యాస్ ఏజెన్సీలు

రూల్స్ బ్రేక్ చేస్తే క్లిక్ మనిపిస్తున్న ‘సిటిజన్​’ పోలీస్​