గవర్నర్​తో సుచిత్ర ఎల్లా భేటీ

గవర్నర్​తో సుచిత్ర ఎల్లా భేటీ

హైదరాబాద్, వెలుగు : గవర్నర్ తమిళి సైను భారత్ బయోటిక్ కో-ఫౌండర్ సుచిత్ర ఎల్లా మంగళవారం రాజ్ భవన్​లో కలిశారు. ఇటీవల బైరాన్​పల్లి వెళ్లి వస్తుండగా సిద్దిపేట జిల్లా చేర్యాల దగ్గర సంధ్యారాణి అనే మహిళ గవర్నర్ కాన్వాయ్​ని ఆపారు. తమిళి సై సంధ్యారాణి ఇంటిని పరిశీలించారు. తనకు ఇల్లు మంజూరు కాలేదని, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉంటున్నానని గవర్నర్​కు చెప్పగా, ఆమె చలించిపోయారు. 

సంధ్యారాణి పరిస్థితిపై గవర్నర్ ట్వీట్ చేయగా, సుచిత్ర ఎల్లా స్పందించి, పిల్లల చదువుకు సాయం చేస్తానని, సంధ్యకు జినోమ్ వ్యాలీలో జాబ్​ ఇస్తామని హామీ ఇచ్చారు. సంధ్య వివరాలను రాజ్ భవన్ అధికారుల నుంచి సుచిత్ర ఎల్లా తీసుకున్నారు.