తెలంగాణలో 2027 నాటికి 5 లక్షల మందికి జాబ్స్​

తెలంగాణలో 2027 నాటికి  5 లక్షల మందికి జాబ్స్​

హైదరాబాద్​, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే ఐదేళ్లలో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో, ఇండస్ట్రీలతో కలసి పనిచేస్తామని కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ ఇండస్ట్రీ, సదరన్​ రీజియన్ ప్రకటించింది. తెలంగాణలో 2027 నాటికి  ఐదు లక్షల మందికి జాబ్స్​ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని సంస్థ చైర్మన్, భారత్​ బయోటెక్​ జేఎండీ సుచిత్రా ఎల్లా అన్నారు. 25 లక్షల మంది ఉపాధి కల్పించాలనే టార్గెట్​ను చేరుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను పెట్టుబడులకు అనువైనవని ప్రచారం చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న బిజినెస్​లను విస్తరించడానికి ఇండస్ట్రీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నందున వ్యాపారం చేయడం సులువని సుచిత్ర అన్నారు.