 
                                    - ఏబీవీపీ నాయకులు, అయ్యప్ప స్వాములు ఆందోళన
జీడిమెట్ల, వెలుగు: అయ్యప్ప మాల ధరించి వచ్చిన ఓ స్టూడెంట్ను స్కూల్ యాజమాన్యం అనుమతించలేదు. యూనిఫాం లేకుండా రావద్దని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు, అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సుచిత్రలోని షేర్ ఉడ్ పబ్లిక్ స్కూల్ లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు.
గురువారం మాలధారణలో స్కూల్కు రాగా, యూనిఫాం లేకుంటే రావద్దంటూ యాజమాన్యం అడ్డుకున్నది. విషయం తెలుసుకున్న ఏబీవీవీ నాయకులు, అయప్పస్వాములు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. మాలలో ఉన్న స్టూడెంట్ను యూనిఫామ్, షూ వేసుకుని రావాలని చెప్పడం బాధాకరమన్నారు. సుప్రీం కోర్టు అదేశాలు ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడం, స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది.

 
         
                     
                     
                    