
ఆఫ్రికా దేశంలోని సూడాన్ లోప్రకృతి విళయతాండవ చేసింది. మర్రా పర్వతాల్లో కొండచరియలు విడిగిపిడి ఓ గ్రామం ఆనవాళ్లు లేకుండా పోయింది. కొండచరియలు విరిగిపడి వెయ్యిమందికిపైగా చనిపోయారు. సూడాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న తర్వాత ఈ విపత్తు సంభవించింది.ఆగస్టు 31న ఈ ఘోర విపత్తు జరిగినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు తెలిపారు.
కొండచరియలు విరిగిపడటంతో గ్రామం పూర్తిగా నేలమట్టమైంది, టన్నుల కొద్దీ శిథిలాల కింద ఇళ్లు ,కుటుంబాలు సమాధి అయ్యాయి.మృతుల్లో పురుషులు, మహిళలు ,పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
సుడాన్ లో యుద్ద ప్రాతిపకన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను వెలికి తీయడం కోసం ఐక్యరాజ్యసమితి , అంతర్జాతీయ మానవతా సంస్థలకు విజ్ణప్తి చేసింది అక్కడి ప్రభుత్వం.
ఓవైపు సూడాన్‌లో ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న క్రమంలో మరోవైపు ఈ విషాదం చోటుచేసుకుంది. సూడాన్ సాయుధ దళాలు ,పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంతో చాలా మంది బాధితులు మర్రా పర్వతాలలో ఆశ్రయం పొందారు.
రెండేళ్లు సాగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది.జనాభాలో సగం మందికి పైగా ఆకలి ,వైద్య అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.