
ఖమ్మం సిటీలో సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. వివిధ పనుల కోసం సిటీకి వచ్చిన జనం తడిసి ముద్దయ్యారు.
కుండపోత వాన
గుండాల, వెలుగు : గుండాల మండలంలో సోమవారం కుండపోత వాన పడింది. పోతిరెడ్డిగూడెం గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో వరద నీరు ఇండ్లలోకి చేరాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పిడుగు పడి 13 మేకలు మృతి
సుజాతనగర్, వెలుగు: సుజాతనగర్ మండలం లో పిడుగు పడి 13 మేకలు చనిపోయాయి. మండల కేంద్రంలోని కాసాని ఐలయ్య కాలనీ చెందిన కేసుపాక శ్రీను స్థానికంగా ఉన్న జామాయిల్ తోటలో మేకలను మేపుతుండగా పిడుగు పడడంతో స్పాట్‌లోనే చనిపోయాయి.