హెబ్బులి’గా వస్తున్న సుదీప్

హెబ్బులి’గా వస్తున్న సుదీప్

సుదీప్‌‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.  ఆయన నటించిన పలు కన్నడ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. కిందటేడాది ‘విక్రాంత్ రోణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుదీప్.. త్వరలో ‘హెబ్బులి’ అనే మరో చిత్రంతో రాబోతున్నాడు. అమలాపాల్ హీరోయిన్. నిర్మాత సి.సుబ్రహ్మణ్యం  తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ఆల్రెడీ కన్నడలో విడుదలైన  ‘హెబ్బులి’ సూపర్‌‌ కలెక్షన్లు సాధించింది. తెలుగులోనూ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్  బాపిరాజు మాట్లాడుతూ ‘సుదీప్ గత చిత్రం ‘విక్రాంత్‌‌ రోణ’ కంటే ఇది పెద్ద హిట్‌‌ కావాలని కోరుకుంటున్నా. ఫిబ్రవరి  25న తెలుగు రాష్ట్రాల్లో  విడుదల చేస్తున్నాం’ అన్నారు. నిర్మాతలు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ తదితరులు సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.