మంచికి, చెడుకి మధ్య యుద్ధం

మంచికి, చెడుకి మధ్య యుద్ధం

రీసెంట్‌‌‌‌గా ‘హరోం హర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సుధీర్ బాబు.. తాజాగా మరో సినిమాకు సైన్ చేశాడు. ఈసారి సూపర్ నేచురల్ మిస్టరీ  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటించబోతున్నాడు. వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని  ప్రేర‌‌‌‌ణ అరోరా, శివిన్ నార‌‌‌‌గ్‌‌‌‌, నిఖిల్ నంద‌‌‌‌, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు.  లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో దీన్ని రూపొందిస్తున్నట్టు, ఇందులో  విజువ‌‌‌‌ల్ ఎఫెక్ట్స్‌‌‌‌కి ఎంతో ప్రాధాన్యత ఉందని మేకర్స్ చెప్పారు. కుట్ర, ప‌‌‌‌న్నాగాలు క‌‌‌‌ల‌‌‌‌గ‌‌‌‌లిసిన చెడుకి, మంచికి జ‌‌‌‌రిగే యుద్ధంగా  మ‌‌‌‌న పురాణాల‌‌‌‌తో అనుసంధానం చేయ‌‌‌‌బ‌‌‌‌డిన ఎన్నో ర‌‌‌‌హ‌‌‌‌స్యాల‌‌‌‌ను ఈ చిత్రం వెలికి తీస్తుందని అన్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌‌‌‌ నటించబోతుందని త్వరలోనే ఆమె షూటింగ్‌‌‌‌లో జాయిన్ కానుందని తెలియజేశారు.  వ‌‌‌‌చ్చే ఏడాది శివ‌‌‌‌రాత్రి సంద‌‌‌‌ర్భంగా మార్చిలో సినిమా విడుద‌‌‌‌ల చేయ‌‌‌‌నున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15న ఫస్ట్ లుక్‌‌‌‌ను విడుదల చేయనున్నారు.