
సుధీర్ బాబు (Sudheerbabu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్-డ్రామా మూవీ హరోమ్ హర (Harom Hara).హరోమ్ హర మూవీని 1989 బ్యాక్ డ్రాప్తో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక.
మొదట ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు వార్తలు రాగా..తాజాగా హరోమ్ హర రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. "ఇంగ సెప్పేది ఎం లేదు, సేసేదే..ఈ సంవత్సరం మన ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ పుట్టినరోజును హరోమ్ హరతో జరుపుకుందాం!! అందుకు మే 31 నుంచి వరల్డ్ వైడ్ థియేటర్లలో కలుసుకుందాం" అంటూ రిలీజ్ పోస్టర్ ని విడుదల చేశారు.ఇది పర్ఫెక్ట్ డేట్ అని తెలుస్తోంది.
ఇంగ సెప్పేది ఎం లేదు, సేసేదే🔥❤️🔥
— Sudheer Babu (@isudheerbabu) April 27, 2024
Let's celebrate our evergreen SUPERSTAR's birthday with #HaromHara this year!!
In Theaters World Wide from MAY 31st!!@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @jungleemusicSTH @SSCoffl pic.twitter.com/taK2dqeeG3
ఎందుకంటే, వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సమయంలో పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అలాగే కృష్ణ పుట్టినరోజు కూడా మరో విశేషం.
ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది. అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. ఇలాంటి సీన్స్ కి తగ్గ స్టోరీ సెట్ అయితే మాత్రం థియేటర్లో పూనకాలు ఖాయం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం సుధీర్ బాబు చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట.అలాగే, ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది.