సుధీర్ బాబు హరోం హర సోలోగా రిలీజ్

సుధీర్ బాబు హరోం హర సోలోగా రిలీజ్

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’.  సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌‌‌గా షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ను కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్‌‌‌‌ను పోస్ట్ పోన్ చేస్తూ మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 31న రిలీజ్ చేయాలని భావించినా.. కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ఈ చిత్రాన్ని మరో రెండు వారాలు వాయిదా వేశారు. 

ఫైనల్‌‌‌‌గా జూన్ 14న ఈ సినిమాను వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పైగా ఈ డేట్‌‌‌‌లో నోటెడ్ సినిమా ఏదీ లేనందున, తమ చిత్రాన్ని సోలోగా విడుదల చేసే ప్లాన్‌‌‌‌లో ఉన్నారు. ఈ సందర్భంగా రిలీజ్  చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో పొడవాటి  తుపాకీని భుజంపై వేసుకుని సీరియస్‌‌‌‌గా నడుచుకుంటూ ఇంటెన్స్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు సుధీర్. 

1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో  సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పాడు.  మాళవిక శర్మ హీరోయిన్‌‌‌‌. సునీల్, అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి