SS5: హీరోగా సుడిగాలి సుధీర్.. విలన్‌‌గా శివాజీ.. మైథలాజికల్ జోనర్లో పాన్ ఇండియా మూవీ

SS5: హీరోగా సుడిగాలి సుధీర్.. విలన్‌‌గా శివాజీ.. మైథలాజికల్ జోనర్లో పాన్ ఇండియా మూవీ

బుల్లితెరపై  సుడిగాలి ట్యాగ్‌‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న  సుధీర్ ఆనంద్ ఓవైపు కామెడీ షోస్, యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు హీరోగానూ వరుస చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా తను లీడ్‌‌ రోల్‌‌లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందబోతోంది.

‘హైలెస్సో’ టైటిల్‌‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నాడు. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోస్‌‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు.

హీరో నిఖిల్ టైటిల్‌‌ను లాంచ్ చేయగా, నిర్మాత బన్నీ వాసు  స్క్రిప్ట్‌‌ను అందజేశారు. దర్శకులు వశిష్ట, చందూ మొండేటి, మెహర్ రమేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరోగా సుధీర్‌‌‌‌కు ఇది ఐదవ చిత్రం. నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో మైథలాజికల్ అంశాలను టచ్ చేసినట్లు టైటిల్ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. కాలికి ఉంగరాలు, బంగారు చీలమండలతో ఓ రాజ పాదం గంభీరంగా గ్రీన్ ఆకుపై అడుగు పెడుతుండగా హైప్ క్రియేట్ చేస్తోంది. అక్కడే సింధూరం కలిపి వండిన అన్నం, కోడి, మేక తలలు ఉండడం విలేజ్‌లో జాతర సంప్రదాయం బ్యాక్ గ్రౌండ్ అని తెలుస్తోంది. దీంతో పాటే రక్తంతో తడిసిన కత్తి ఉండడం ఆసక్తిని పెంచేసింది

ఈ చిత్రంలో  శివాజీ విలన్‌‌గా కనిపించబోతున్నాడు. మొట్ట రాజేంద్రన్, గెటప్ శ్రీను, బెవర దుహిత శరణ్య ఇతర  పాత్రలు పోషిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌‌‌‌గా, విజయ్ పోలాకి కొరియోగ్రఫీ-బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.