ఎన్నికల ప్రచారంలో సుహాసిని తీన్మార్ డ్యాన్స్

 ఎన్నికల ప్రచారంలో సుహాసిని తీన్మార్ డ్యాన్స్
  • కమల్ హాసన్ కు మద్దతుగా అక్షర హసన్ తో కలసి ఇంటింటి ప్రచారం

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కలర్ ఫుల్ గా సాగుతోంది. ప్రచార పర్వం ముగియనున్న చివరి గంటల్లో స్టార్ క్యాంపెయినర్, సినీ నటి సుహాసిని.. తన సోదరి, కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హసన్ తో కలసి తీన్మార్ స్టెప్పులేసింది. అది కూడా నడి రోడ్డుపై. గల్లీ గల్లీ తిరుగుతూ.. బాబాయ్ కమల్ హాసన్ తరపున ఇంటింటి ప్రచారం చేసిన సుహాసిని.. తన సోదరి అక్షర హాసన్ తో కలసి తీన్మార్ డ్యాన్సుతో అదరగొట్టింది. మణిరత్నంను పెళ్లి చేసుకున్న సుహాసిని.. తరచూ తమిళ,తెలుగు సినిమాలు చేస్తున్న సుహాసిని తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తున్న విషయం తెలిసిందే.  

దక్షిణ కోయంబత్తూరులో కలర్ ఫుల్  ప్రచారం
మక్కల్ నీది మయ్యమ్ (ఎం.ఎన్.ఎం) పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కమల హాసన్ దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన అభిమానులు ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు నుండి బరిలోకి దిగిన కమల్ హాసన్ విజయం కోసం సుహాసిని.. అక్షర హసన్ సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీ తరపున ఖుష్బూ, నమిత, గౌతమి తదితరులు, డీఎంకే తరపున స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి మారన్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తుండడంతో తన బాబాయ్ కమల్ హాసన్ కు మద్దతుగా సుహాసిని రంగంలోకి దిగింది. తన సోదరి అక్షర హాసన్ తో కలసి తమిళనాడు ప్రచారాన్ని హీటెక్కించింది. బాబాయ్ కమల హసన్ పార్టీ గుర్తు అయిన టార్చి లైట్ ను చేతపట్టుకుని.. వీలున్న చోట్ల డప్పు చప్పుళ్లకు స్టెప్పులేస్తూ.. అభిమానులను హుషారెత్తించింది సుహాసిని. ఒక వీధిలో అక్షర హాసన్ తో కలసి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా సుహాసిని చేసిన తీర్మార్ డ్యాన్సుల  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.