పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా: పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం జరిగిందీ ఘటన. రాఘవపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయితో ఇతడు గత కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి వారి దృష్టికి వెళ్లింది. ఇరువురి కులాలు వేరు కావడం.. జీవితంలో స్థిరపడాల్సిన వయసులో తప్పుదోవపడుతున్నాడని అమ్మాయి కుటుంబీకులు అబ్బాయి పై యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు తనను పిలిపించారని తెలిసి భయపడిపోయిన యువకుడు పోలీస్ స్టేషన్ కి వస్తూ వస్తూ.. స్టేషన్ ఆవరణలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబీకులు పోలీసులను అప్రమత్తం చేశారు. అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేస్తూ పురుగుల మందు తాగినట్లు గుర్తించి ప్రథమ చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.