Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ 10 విన్నర్ ప్రైజ్ మనీలో భారీ కోత.. ఎన్ని లక్షలు తగ్గిందంటే?

Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ 10 విన్నర్ ప్రైజ్ మనీలో భారీ కోత.. ఎన్ని లక్షలు తగ్గిందంటే?

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' అంటేనే ఊహించని మైండ్ గేమ్స్, ఎన్నో మలుపులు, సంచలన నిర్ణయాలు. లేటెస్ట్ గా 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' నాలుగో వారం నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఒక ఘటన .. షో చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. సాధారణంగా గ్రాండ్ ఫినాలే రోజున టాప్-5 కంటెస్టెంట్లకు మాత్రమే ఇచ్చే డబ్బులా? కప్పా? ఆఫర్‌ను.. సీజన్ మధ్యలోనే వాడేసి నాగార్జునతో సహా ప్రేక్షకులందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మిథిలేష్..

హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ తో అడుగుపెట్టిన కేవలం రెండే రెండు రోజుల్లోనే తన ప్రాక్టికల్ మైండ్‌సెట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు మిథిలేష్. హోస్ట్ అక్కినేని నాగార్జున రూ. 15 లక్షల నగదు ఆఫర్ ఇవ్వగానే, ఏమాత్రం ఆలోచించకుండా ఆ డబ్బును స్వీకరించి హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. షో చివరి వరకు ఉన్నా గెలుపుపై నమ్మకం లేని పరిస్థితుల్లో.. ఆరంభంలోనే రూ.15 లక్షలు పట్టుకుని రావడం మామూలు స్మార్ట్ మూవ్ కాదు.

గతంలోబిగ్ బాస్ ఫినాలే రోజూ సోహెల్  తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు మిథిలేష్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 100 రోజులు హౌస్‌లో ఉండి గెలిచినా చేతికి వచ్చే డబ్బుతో పోలిస్తే.. రెండే రోజుల్లో రూ. 15 లక్షలు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. లక్ అంటే ఇదేనేమో అని మరి కొందరు మెచ్చుకుంటున్నారు..

►ALSO READ | Allu Sirish: నేనూ హనుమాన్ భక్తుడినే.. కంప్లయింట్ చేసింది సివిక్ సెన్స్

మిథిలేష్ ఇచ్చిన ఈ ఊహించని ట్విస్ట్ వల్ల బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ ప్రైజ్ మనీపై తీవ్ర ప్రభావం పడింది. బిగ్ బాస్ మొత్తం రూ. 50 లక్షల పూల్ ప్రైజ్ మనీ నుంచి ఈ రూ. 15 లక్షలు నేరుగా తగ్గిపోయింది. ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ దక్కించుకోబోయే ప్రైజ్ మనీ రూ. 35 లక్షలకు పడిపోయింది. ఇంత భారీ మొత్తంలో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ తగ్గిపోవడం ప్రేక్షకులను షాకింగ్ కు గురిచేస్తోంది. 

ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ జరగని ఈ రేంజ్ ట్విస్ట్ బిగ్ బాస్ 10పై ఆసక్తిని ఒక్కసారిగా పెంచేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మొదలైన ఈ రచ్చ ముందుముందు ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో, ఆఖరికి రూ. 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాల్సిందే..