నోవి సాద్ (సెర్బియా): ఇండియా రెజ్లర్ సుజీత్ కల్కాల్.. అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన మెన్స్ 65 కేజీల క్వార్టర్‌ఫైనల్లో సుజీత్ 4–2తో బషీర్ మాగోమెడోవ్ (రష్యా)పై గెలిచాడు. అంతకుముందు జరిగిన తొలి రెండు బౌట్లలో సుజీత్ 12–2తో ఫియోడర్ సీవ్‌దారి (మాల్డోవా)పై, 11–0తో డొమ్నిక్ జాకుబ్ (పోలెండ్)పై నెగ్గాడు. సెమీస్‌లో సుజీత్.. యుటో నిషుచి (జపాన్)తో తలపడతాడు.
61 కేజీల్లో తొలి బౌట్ గెలిచిన శుభమ్ ప్రిక్వార్టర్స్‌లో జేహున్ అల్లావెర్దియేవ్ (అజర్‌బైజాన్) చేతిలో టెక్నికల్ సుపిరియారిటీతో ఓడాడు. 86 కేజీ క్వాలిఫికేషన్‌లో ఆశిష్ 4–6తో అబోల్‌ఫజల్ యాసర్ రెహ్మానీ (ఇరాన్) చేతిలో కంగుతిన్నాడు. 97 కేజీల్లో విక్కీ మంచి పెర్ఫామెన్స్ చూపెట్టాడు. తొలి రౌండ్‌లో 10–0తో ఒటాబెక్ నజీర్‌బోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు.
కానీ తర్వాతి రౌండ్‌లో 13–15తో మెరాబ్ సులేమానిష్విలి (జార్జియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రవీందర్ (74 కేజీ), సుమిత్ మాలిక్ (57 కేజీ), నవీన్ కుమార్ (70 కేజీ), చందర్ మోహన్ (79 కేజీ), సచిన్ (92 కేజీ) ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. 125 కేజీ కేటగిరీలో ఇండియా ఏ రెజ్లర్‌ను బరిలోకి దించలేదు.
