Sukesh Chandrasekhar: జైల్లో లగ్జరీ లైఫ్.. బోరున విలపిస్తున్న సుకేశ్

Sukesh Chandrasekhar: జైల్లో లగ్జరీ లైఫ్.. బోరున విలపిస్తున్న సుకేశ్

మనీల్యాండరింగ్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‭కు సంబందించిన ఓ వీడియో బయటికి వచ్చింది. సుకేశ్ ఉంటున్న గదిని జైలు అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలర్ దీపక్ శర్మతో పాటు ఇతర ఆఫీసర్లు సుకేశ్ గదికి వెళ్లారు. ఈ తనిఖీల్లో చాలా విలువైన లగ్జరీ వస్తువులు బయటపడ్డాయి. అతను ఉంటున్న జైలు గదిలో రూ.1.5లక్షల విలువైన గుక్కి సాండిల్, సుమారు రూ.80వేల ఖరీదైన రెండు జతల జీన్ పాంట్లను గుర్తించారు.

ఇక జైలర్ గదికి వచ్చిన సమయంలో సుకేశ్ ఓ మూలన కూర్చుని బోరున ఏడుస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే.. సుకేశ్ జైలు గదికి సంబంధించిన విజువల్స్ లీకైన అంశం పై దర్యాప్తు చేపట్టనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. కాగా.. 200 కోట్ల మ‌నీల్యాండ‌రింగ్ కేసులో సుకేశ్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నోరా ఫ‌తేహ్‌ల‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు.