బీజేపీలో చేరుతున్నా... పోటీ నుంచి తప్పుకుంటున్నా : సుమలత అంబరీష్

బీజేపీలో చేరుతున్నా... పోటీ నుంచి తప్పుకుంటున్నా  :   సుమలత అంబరీష్

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నటి, ఎంపీ  సుమలత అంబరీష్ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు.  దీంతో పాటుగా బీజేపీలో చేరుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు.  మండ్యలో మద్దతుదారుల సమావేశంలో సుమలత మాట్లాడుతూ ..  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. 

దీని ద్వారా జేడీఎస్ అభ్యర్థి, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి ఆమె మద్దతు పలికారు. మాండ్య  ప్రజలు తనకు అమ్మ స్థానం ఇచ్చారని, ఈ తల్లిని బిడ్డలకు ఎప్పటికీ దూరం చేయలేరని భావోద్వేగంతో మాట్లాడారు.  2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాండ్య లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సుమలత భారీ మెజార్టీతో ఎంపీ గెలిచారు.  ఏప్రిల్ 6న బీజేపీలో చేరుతున్నట్లు సుమలత  ప్రకటించారు.

ALSO READ :- Geethanjali Malli Vachindi Trailer: నవ్విస్తూనే గుండెల్లో భయం పెంచుతున్న..గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్

మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. పార్లమెంట్ ఎన్నికల తరువాత సుమలతకు బీజేపీ మంచి పదవి, హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.