
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి స్టూడెంట్లకు శనివారం నుంచి ఈ నెల 22 వరకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–2) పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 20 వరకు, 6 నుంచి 9వ తరగతికి 16 నుంచి 22 వరకు కొనసాగుతాయి. ప్రైమరీ క్లాసులకు ఉదయం 8 నుంచి 10:30 వరకు, 6, 7 క్లాసులకు 8 నుంచి 10:45 వరకు, 8వ తరగతికి 11:30 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు, 9వ తరగతికి ఉదయం 8 నుంచి 10:45 వరకు పేపర్ 1, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు పేపర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 23న ఎస్ఏ 2 పరీక్షల రిజల్ట్ వెల్లడించనున్నారు.