Summer Fruits : మ్యాంగో, సీమ చింతకాయలు తింటే మస్త్ ఆరోగ్యం..!

Summer Fruits : మ్యాంగో, సీమ చింతకాయలు తింటే మస్త్ ఆరోగ్యం..!

ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎండాకాలంలో స్పెషల్ గా దొరికే ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని శరీరాన్ని చల్లబరుస్తాయి. మరికొన్ని ఈ కాలంలో వచ్చే పలు వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇంకొన్ని పోషకాలు అందిస్తాయి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. అందుకే, సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.

వేసవి తాపాన్ని తట్టుకుని, కాస్త కూల్గా ఉండాలంటే.. ఈ కాలంలో వచ్చే వడదెబ్బ, చికెన్ ఫాక్స్, విరేచనాలు.. లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. నీరసం రాకండా, తక్షణ శక్తి పొందాలంటే.. ఎండాకాలంలో దొరికే అన్ని రకాల పండ్లు తినాల్సిందే. అయితే, వాటిలో ఏఏ రకాల ప్రొటీన్స్ ఉన్నాయి? ఏఏ వ్యాధులు రాకుండా కాపాడతాయి? అసలు ఎండాకాలంలో దొరికే ఫ్రూట్స్ ఏంటి? ఎలా తినాలి?

మామిడి

వేసవికాలంలో విరివిగా దొరికే పండు మామిడి. ఇవి పండటానికి సిద్ధంగా ఉన్నప్పుడే పంట కోసం పరిగడ్డిలో ఉంచుతారు. దీనిలో ఏ, బీ, సీ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, చక్కెర, పీచుపదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము,  రాగి, థయామిన్, సియాసిస్ లాంటి ఆమ్లాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే మామిడి తప్పకుండా తినాలనేది అందరి మాట. అయితే మామిడికాయ తిన్న తర్వాత అరగకపోతే చిటికెడు బియ్యం తింటే తేలిగ్గా జీర్ణం అవుతుంది.

సీమ చింతకాయలు... ఎన్ని ఉపయోగాలో

ఎండాకాలంలో దొరికే సీమ చింతకాయలంటే చాలామంది ఇష్టంగా తింటారు. నగరు, తీపి కలిసి రుచిగా ఉంటాయి. వీటిని గుబ్బకాయలు, పులి చింతకాయలని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పులి చింతకాయల్లో ప్రొటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తిన్నప్పుడు పొట్ట, నిండినట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఆకలికాదు. అలాగే వీటిలో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉన్నాయి.


అందువల్ల గర్భిణీలకు చాలా మంచిది. మలబద్దకం తగ్గిస్తాయి. వణుకు, నరాల బలహీనత లాంటివి రాకుండా కాపాడుతాయి. ఈ కాయల్లో కాపర్ కూడా ఉంటుంది. కనుక.. తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సీమచింతకాయల్లో ఉండే పొటాషియం శరీరంలోని పీహెచ్ లెవల్స్ పెరగకుండా, తగ్గకుండా చేస్తుంది. గుండె కొట్టుకోవడం, మజిల్ ఫంక్షన్ సరిగా జరగడానికి ఈ కాయలు ఉపయోగపడతాయి. 

ఈ కాయల్లో ఫ్యాట్ ఉండదు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుతాయి. తినడం వల్ల బరువు పెరగరు. ఆహార నిపుణులు రోజూ కప్పులో నాలుగోవంతు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. అలా కుదరకపోయినా వేసవిలో దొరికే వీటిని తప్పకుండా తినడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది.