ఎండలు దంచుతున్నయ్

ఎండలు దంచుతున్నయ్

రోజుకో డిగ్రీ పెరుగుతున్న టెంపరేచర్‌ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతోంది. బుధవారం మెదక్ లో 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో 38.2 డిగ్రీలు రికార్డయ్యింది. ఉదయం తొమ్మిది దాటితే చాలు సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చిలోనే పరిస్థితిలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి వేడి రోజుకో డిగ్రీ చొప్పున పెరుగుతోంది. మధ్యాహ్నం పూట రోడ్డుపై పది నిమిషాలు తిరిగి రావడానికి జనం తెగ ఆయాస పడిపోతున్నారు. బుధవారం మెదక్‌ లో 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న మహబూబ్‌ నగర్‌ లో 38.5 డిగ్రీల వేడి దడ పుట్టించింది. ఉదయం తొమ్మిది దాటితే చాలు సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చిలోనే పరిస్థితిలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ స్థాయిలో ఎండలు పెరగడానికి పట్టణీకరణ, కాలుష్యమే కారణమని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి వల్ల ఎండలు మరింత పెరిగే చాన్స్ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌‌లోనూ భగభగలు
సిటీలోనూ రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. మార్చి 1న గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కాగా, 7వ తేదీ వచ్చేసరికి 36 డిగ్రీలకు పెరిగింది. బుధవారం 38.2 డిగ్రీల సెల్సియస్‌‌తో నగరవాసులు బెంబేలెత్తిపోయారు.