జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్

జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్

తెలంగాణలో రేపటినుండి అంటే ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుంచి స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి.  జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. మొత్తంగా 49 రోజుల పాటు సెలవులు రానున్నాయి.   ఈ విషయాన్ని విద్యాశాఖ ప్రకటించింది.  తిరిగి  జూన్ 12న  స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి.  ఈ వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది.  ఇందుకో సం రూ. 1100కోట్ల నిధులను ఖర్చు చేస్తుంది. పనులను పూర్తి చేసి, జూన్‌ 5 కల్లా బడులను సిద్ధం చేయాలని గడువు విధించింది. 

ఇక ఇప్పటికే ఇంటర్ విద్యార్ధులకు బోర్డు సెలవులు ప్రకటించింది. మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి. ఇక  అటు ఏపీలో కూడా ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించారు. జూన్ 13 న స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. వారికి  50 రోజుల వేసవి సెలవులు వచ్చాయి.