మేలో రిలీజ్ కి రెడీ అవుతున్న సమ్మర్‌‌‌‌ హాలీడేస్‌‌

మేలో రిలీజ్ కి రెడీ అవుతున్న సమ్మర్‌‌‌‌ హాలీడేస్‌‌

ఇటీవల ‘కపుల్‌‌ ఫ్రెండ్లీ’ చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌‌‌‌ ధీరజ్ మొగిలినేని.. ‘సమ్మర్ హాలీడేస్‌‌’ అనే మరో చిత్రాన్ని రిలీజ్‌‌కు రెడీ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం టైటిల్‌‌ను అనౌన్స్‌‌ చేశారు.  ‘90’s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మాస్టర్ రోహన్ రాయ్‌‌,  ‘35 చిన్న కథ కాదు’ ఫేమ్ మాస్టర్ అరుణ్‌‌ లీడ్ రోల్స్​లో  నటిస్తున్నారు.  

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మే1న ఈ చిత్రాన్ని థియేటర్స్‌‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ ఆసక్తికరమైన కథతో వినోదాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్‌‌ తెలియజేశారు.