
హైదరాబాద్ : వయస్సు, అర్హతతో నిమిత్తం లేకుండా బైక్ లు నడపడానికి నేటి టీనేజీ కుర్రకారు ఆసక్తి కనబరుస్తోంది. వేగంగా బైకులు నడపుతూ హీరోల్లా ఫీలవుతున్నారు. ఇదంతా అర్హత ఉండి హద్దుల్లో చేస్తే బాగుంటుంది. కానీ కనీసం వారు మైనారిటీ తీరకుం డానే చేస్తుం డడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వీరికి దిశానిర్దేశం చేయాల్సిన తల్లిదండ్రులు సైతం ఇవేవి పట్టించుకోకుండా వారికే మద్దతు ఇస్తున్నారు. ముక్కుపచ్చలారని పిల్లాడి చేతులో బైకు పెట్టి మురిసి పోతున్నారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి చిన్నారులు విలువైన ప్రాణాలు కోల్పొతుండగా… తల్లిదండ్రులకు పూడ్చలేని తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. పిల్లలకు ట్రాఫిక్ ని బంధనలు చెబుతూ వాహనం డ్రైవింగ్ చేసే వయస్సు, అర్హత వచ్చేవరకూ తల్లిదండ్రులు వాహనాలను చిన్నారుల చేతికి ఇవ్వొద్దని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వస్తున్నారు. ఇంకో అడుగు ముం దుకేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
వేసవికాలం రావడంతో మైనారిటీ తీరని ఎందరో బడిఈడు, జూనియర్ కళాశాల పిల్లలు బండిపై షికార్లు చేస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్ ను ఆరికట్టి వారి ప్రాణాలను రక్షించే బాధ్యతను ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలను ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు. ఇందులో భాగంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేసవికాలం సందర్భంగా మైనర్ డ్రైవింగ్ పై బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జీడిమెట్ల పరిధిలోని సూరారం, టీఎస్ ఐఐసీలతో పాటు పలు కాలనీల్లో ని అంతర్గత రోడ్లకు వెళ్లి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అర్హత లేకుండా వాహనాలు నడుపుతున్న 12 మందిపై మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవి చేస్తున్నామని అన్నారు. కనీసం ఇలాం టి చర్యలతోనైనా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని వారు కోరుతున్నారు.