జ్యోతిష్యం : రోహిణి కార్తె వచ్చేసింది.. రోళ్లు పగిలే ఎండలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

జ్యోతిష్యం : రోహిణి కార్తె వచ్చేసింది.. రోళ్లు పగిలే ఎండలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

సమ్మర్​ సీజన్​ అంతా ఒక ఎత్తేతే ఈ 15 రోజులు ( మే 25 నుంచి జూన్​ 8) వరకు  ఎండలు ఠారెత్తిస్తాయి.  రోహిణి కార్తె ( మే 25) మొదలైంది..  అసలు రోహిణి కార్తె అంటేఏమిటి.. రోహిణిలో రోళ్లు ఎందుకు పగులుతాయి..  ఈ 15 రోజులు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

జ్యోతిష్య శాస్త్రం  సూర్యుడు రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించే 15 రోజులు రోహిణి కార్తె అంటారు. ఎండలు పీక్స్‌కి వెళ్లే టైం. రోహిణిలో ఎండకు రోలు పగులుతాయి అనే సామెత ఉంది.ఈ కార్తెలో వర్షం పడితే, ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని నమ్మకం. రోహిణి కార్తెలో వాన పడితే రాళ్లు కూడా కాస్తాయి" అంటారు.

రోహిణి కార్తె సమయంలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయి.ఈ వేడికి కారణంగా శరీరం నుండి నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. రోహిణి కార్తెలో ( 2026 మే 25 నుంచి జూన్​ 8) వరకు ఎండల తీవ్రత ఎక్కువుగా ఉంటుంది.  ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు.. కొత్త పనులు చేయరు.  అందులోనే ఈ ఏడాది అధికమాసం కూడా ఉంది. ఈ 15 రోజుల పాటు ప్రజలంతా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. శరీరానికి వేడిచేసే పదార్దాలను... మాంసాహారాన్ని తినకకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది. బాడి టెంపరేచర్​ పెరగకుండా..చల్లటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు.  

►ALSO READ | జ్యోతిష్యం : గ్రహాల కదలిక...ఆరోగ్య సమస్యలు .. మానవ శరీరంపై గ్రహాల ప్రభావం ఇదే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ... ఈ 1 5 రోజులు  ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.  ఈ సమయంలో మన స్తోమతకు తగ్గట్లుగా దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యమని పండితులు చెబుతున్నారు.

డీహైడ్రేషన్ నివారణ చిట్కాలు

  •  రోజంతా తరచుగా నీరు తాగండి. 
  •  ORS, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు తీసుకోండి. 
  •  పుచ్చకాయ, దోసకాయ, ఖర్బూజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినండి. 
  •  ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, ఛత్రి ఉపయోగించండి. 
  • ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దు.  బయటకు వెళ్లేటప్పుడు గొడుకు దగ్గర ఉంచుకోండి.  
  •  లేత రంగు దుస్తులు ధరించండి