బాబోయ్ ఎండలు.. వడదెబ్బతో ముగ్గురు మృతి

బాబోయ్ ఎండలు.. వడదెబ్బతో ముగ్గురు మృతి
  • నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌లో కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలిన రైతు
  • మంచిర్యాల జిల్లాలో ఒకరు, వనపర్తి జిల్లాలో మరొకరు..

నకిరేకల్, వెలుగు : వడదెబ్బతో ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బాబాసాహెబ్‌‌‌‌గూడెం గ్రామానికి చెందిన ఎండీ.నజీర్ (68) తనకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆదివారం కోత పూర్తి కావడంతో వడ్లను మార్కెట్‌‌‌‌ రోడ్డులోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. సోమవారం ఉదయం బైక్‌‌‌‌పై కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన నజీర్‌‌‌‌.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న రైతులు గమనించిన వెంటనే స్థానిక ఏరియా హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
 
మంచిర్యాలలో యువకుడు..

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు : వడదెబ్బతో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని శాంతినగర్​గ్యారేజ్‌‌‌‌ లైన్‌‌‌‌కు చెందిన బండవరం ప్రశాంత్ (30) మందమర్రి మండలం మామిడిగూడెం ఆంజనేయస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. సోమవారం వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కూప్పకూలి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వనపర్తిలో పశువుల కాపరి

వీపనగండ్ల, వెలుగు : వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పశువుల కాపరి మురళి (45) వడదెబ్బతో చనిపోయాడు. సోమవారం ఉదయం బయటకు వెళ్లిన మురళి ఎండ తీవ్రత కారణంగా స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు మొదట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం వనపర్తి హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ మురళి చనిపోయాడు.