సన్ ఫార్మా చేతికి టారో

సన్ ఫార్మా చేతికి టారో

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ కంపెనీ టారో ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ మొత్తం షేర్లను కొనుగోలు చేయాలని సన్‌‌‌‌ ఫార్మా నిర్ణయించుకుంది. సాధారణ షేరుకి 38 డాలర్లను ఇందుకోసం ఖర్చు చేయనుంది. టారో గురువారం క్లోజింగ్ ధరతో పోలిస్తే ఇది 31.2 శాతం ఎక్కువ. ఇజ్రాయిల్ చట్టాల ప్రకారం, సన్ ఫార్మా ఈ దేశంలో ఓ హోలీ ఓన్డ్ సబ్సిడరీ లేదా ఎస్‌‌‌‌పీవీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ కంపెనీతో టారోను కొనాల్సి ఉంటుంది. క్యాష్ డీల్‌‌‌‌ కాగా, ట్రాన్సాక్షన్స్ పూర్తయ్యాక పేమెంట్స్ చేస్తారు. ఒకసారి డీల్ పూర్తయ్యాక టారో  న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి నుంచి విత్‌‌‌‌డ్రా అవుతుంది.  సన్‌‌‌‌ ఫార్మాకు ఫుల్లీ ఓన్డ్‌‌‌‌ సబ్సిడరీగా మారుతుంది.