జూన్​ 23న ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే...

జూన్​ 23న ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే...

జ్యోతిషశాస్త్రంలో సూర్యుని గమనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. త్వరలోనే సూర్యుడు.. రాహువు పరిపాలించే ఆరుద్ర  నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సూర్యభగవానుడు ఈసారి రాశిచక్రం మార్పుతో పాటు నక్షత్రాన్ని కూడా మార్చబోతున్నాడు.  జూన్ 23న సూర్యుడు మృగశిర నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రానికి మారతాడు.  ఈ 15 రోజుల్లో  కొన్ని  రాశుల వారి భవితవ్యం పూర్తిగా మారుతుంది. ఆరుద్ర  నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడంతో.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  ఏ రాశి వారికి ఎలా  ఉందో  తెలుసుకుందాం.

మేష రాశి : నవ గ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్య దేవుడు జూన్ 23న  ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు . సూర్య గ్రహం  నక్షత్రం మారడం వలన మేషరాశి వారికి ప్రభుత్వ రంగంలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే  అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.

వృషభరాశి: వృషభ రాశి వారికి సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. గృహ లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు ఆర్థిక లాభాలను పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనులలోను విజయం సాధిస్తారు.వీరి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

మిథునం: సూర్యుడు ఆర్థ్ర నక్షత్రంలో ప్రవేశించగానే మిథున రాశి వారి జీవితంలో అనేక ప్రధాన మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యుడు వారికి మంచి ఫలితాలను ఇస్తాడు .వృత్తిలో మీకు ఎన్నో మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీ కల నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ విషయాలలో మీకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

కర్కాటక రాశి :  సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి రావడంతోనే ఈ రాశి వారికి శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలొస్తాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. చాలా వరకు మీ పనులన్నీ నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రమోషన్ పొందుతారు. అయితే అనుకోని ఖర్చులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల వ్యవహారశైలి కొంత మనస్థాపం కలిగించే అవకాశం ఉంది.  నిత్యం సూర్యాష్ఠకం పఠిస్తే ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. 

సింహం : సింహరాశి వారికి సూర్య సంచారం  ఆరుద్ర నక్షత్రంలో శుభదాయకం. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి స్థానం లభిస్తుంది. రాబోయే సమయం మీకు చాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్నది పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. ఈ కాలంలో మీరు డబ్బును ఆదా చేస్తారు. వివాహితులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామికి ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

 కన్యా  రాశి: ఈ రాశి వారు మాత్రం ఆరుద్ర నక్షత్రంలో సూర్యభగవానుడు సంచరించే సమయంలో  చాలా కఠినమైన నిర్ణయాలను, సవాళ్లని ఎదుర్కోవలసి ఉంటుంది.  మీకు సంబంధం లేకుంగా కొన్ని వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎందుకంటే  ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్న సమయంలో  ఈ రాశి వారు కొన్ని ప్రలోభాలకి లోనయి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వివాదాలకు పోకుండా చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. సంపద నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరని పండితులు చెబుతున్నారు. 

తులా రాశి : తులా రాశి వారి సూర్య సంచారం వల్ల జీవితంలో సమతుల్యత వస్తుంది. ఈ కాలంలో మీకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. మీ చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెరపవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం దొరుకుతుంది.

వృశ్చిక రాశి:  సూర్యుడు.. ఆరుద్ర నక్షత్రంలోకి జూన్​ 23న ప్రవేశించనున్నారు. ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ఏపని చేసినా ముహూర్త బలం ప్రకారం చేస్తే విజయం వరిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారులకు  లాభాలు ఉండవు.. అలాగని నష్టాలు కూడా ఉండవు.  ఉద్యోగులు  సహచర సిబ్బందితో జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించి టెండర్లు వేయాలి. అనుకోని ఖర్చులు రావడం వలన ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

ధనుస్సు రాశి : సూర్యుడు ...ఆరుద్ర నక్షత్రంలో  సంచారం వల్ల ధనుస్సు రాశి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా మంచిది. వ్యాపారంలో రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఆరోగ్యం బాగాలేని వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకర రాశి: సూర్య భగవానుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వలన  మకర రాశి వారికి కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. 
స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సంతాన, విద్యా ,ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు అలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరగడంతో అసహనం పెరుగుతుంది. కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి శుభదినాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అదృష్టం వస్తుంది. ఈ కాలంలో మీ చిరకాలంగా పెండింగ్​లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరుతుంది. అంతే కాదు ఈ కాలంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. దీనికి మీ కృషి, అంకితభావం అవసరం. మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది.

మీనరాశి:  ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యభగవానుడు రావడం వలన మీనరాశి వారికి  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.  గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం అనందం కలిగిస్తుంది. నూతన పనులు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.