
సండే అంటేనే స్పెషల్ డే. ఇక ఫుడ్ లవర్స్ కి సండే మరింత స్పెషల్. అయితే ఇప్పటివరకూ చికెన్, మటన్ వెరైటీలే మస్త్ చేసి ఉంటారు. కానీ ఈసారి వెరైటీగా ప్రాన్స్ రెసిపీలు ట్రై చేసి చూడండి. ఇవి చేయడం చాలా ఈజీ కూడా. పైగా పిల్లలైనా.. పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. రొయ్యలు తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది కూడా. ఈ రోజే ప్రాన్ వెరైటీలు ట్రై చేయండి
ప్రాన్ లాలిపాప్స్ తయారికీ కావాల్సినవి:
- టైగర్ రొయ్యలు- అరకేజీ
- సాల్ట్ లేని బటర్- 40 గ్రాములు
- అల్లంవెల్లుల్లి పేస్ట్- 2 స్పూన్స్
- ఎండిమిర్చి, చక్కెరతో తయారుచేసిన స్రిరాచా
- సాస్- 2 స్పూన్స్
- నిమ్మకాయ-1
- తరిగిన కొత్తిమీర - ఒక కప్పు
- మసాలా పొడి- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:రొయ్యలను కాస్త వేగించాలి. వాటికి స్టిక్స్ గుచ్చి పక్కనపెట్టాలి. పాన్ లో బటర్ వేసి కరిగించాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, స్రిరాచా సాస్, మసాలా పొడి, నిమ్మకాయ రసం వేసి కలపాలి. 5 నిమిషాలు ఉడికాక ఈ పేస్ట్ ను రొయ్యలపై రాసి గ్రిల్ చేయాలి. లేదంటే పలచటి పెనంపై రంగు మారేంతవరకు ఫ్రై చేయాలి. వీటికి నిమ్మరసం, సాస్ కలుపుకుని తినాలి
చిల్లి గార్లిక్ ప్రాన్స్ తయారీకి కావాల్సినవి:
- టైగర్ రొయ్యలు - అర కేజీ
- సోయా సాస్ - 2 టేబుల్ స్పూన్స్
- ఒక టేబుల్ స్పూన్
- ఎండిమిర్చి, చక్కెరతో తయారు చేసిన సిరాచా సాస్
- వెల్లుల్లి రెబ్బలు- 5
- పచ్చిమిర్చి- 5
- ఉప్పు- తగినంత
- మసాలా పొడి- 2 స్పూన్స్
- ఆలివ్ ఆయిల్- తగినంత
- వాటర్- అరకప్పు
- చక్కెర- అరకప్పు
తయారీ విధానం: వెల్లుల్లి, పచ్చిమిర్చిలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి చిన్నమంటపై మరిగించాలి. ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, స్రిరాచా సాస్, సాల్ట్, షుగర్, మసాలాపొడి వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసిన రొయ్యలను వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో నీళ్లు పోయాలి. నీళ్లు మొత్తం ఇగిరిపోయేంతవరకూ ఉంచాలి.. మరీ డీప్ ఫైలా కాకుండా మెత్తగా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ పై నుంచి దింపాలి.
స్పెషల్ మసాలా ప్రాన్ కర్రీ తయారీకి కావాల్సినవి:
- టైగర్ రొయ్యలు - అరకేజీ
- టమాటో ముక్కలు - ఒక కప్పు
- ఉల్లిగడ్డ ముక్కలు- ఒక కప్పు
- చింతపండు రసం – అరకప్పు
- పచ్చిమిర్చి- 3
- స్పెషల్ మసాలా కోసం..
- కొత్తిమీర - ఒక కట్ట
- జీలకర్ర- 2 టేబుల్ స్పూన్స్
- కొబ్బరి - ఒక కప్పు
- జీడిపప్పు - ఒక కప్పు
- వెల్లుల్లి రెబ్బలు - 5
- లవంగాలు- 5
- దాల్చిన చెక్క - 1
తయారీ విధానం: ముందు స్పెషల్ మసాలాతయారుచేయాలి. పాన్ లో నూనె కాగాక అందులో రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదే పాన్ లో మళ్లీ కాస్త నూనె వేసి అందులో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపాలి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలను కూడా వేయాలి. ఇందులో రెడీ చేసిన స్పెషల్ మసాలా పేస్ట్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో రొయ్యలు, ఉప్పు, చింతపండు రసం కూడా వేసి 5 నిమిషాలు ఉడికించాలి. కావాలనుకుంటే ఒకకప్పు కొబ్బరి పాలు కూడా కలపొచ్చు. గ్రేవీ దగ్గర అయ్యాక స్టవ్ ఆపేయాలి