హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్స్ గా సుందర్ పిచాయ్

హయ్యస్ట్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్స్ గా సుందర్ పిచాయ్

న్యూయార్క్: టెక్ దిగ్గజం అల్ఫాబెట్ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు వహిస్తున్న సుందర్ పిచాయ్ ధనార్జనలో మిగిలిన ఎగ్జిక్యూటివ్స్ కు అందనంత ఎత్తులో నిలిచాడు. 2019 ఏడాదికి గాను అల్ఫాబెట్ నుంచి 281 మిలియన్ డాలర్లను పిచాయ్ వేతనంగా అందుకున్నాడు. ఈమేరకు అల్ఫాబెట్ ఐఎన్ సీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ప్రపంచంలోనే హయ్యస్ట్ పేయిడ్ ఎగ్జిక్యూటివ్స్ గా పిచాయ్ నిలిచాడు. దీంట్లో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్ రూపంలో వచ్చింది. మిగతా కంపెనీలతో అల్ఫాబెట్ స్టాక్స్ రిటర్న్ కు వీటితో లింక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టాక్ రూపంలో వచ్చే అమౌంట్ తక్కువగా అయినా ఉండొచ్చు.. లేదా భారీ మొత్తంలో అయినా ఉండే చాన్స్ ఉంటుంది. 2019 సంవత్సరానికి గాను పిచాయ్ వార్షిక జీతం 6.50 లక్షల డాలర్లు అని.. ఈ ఏడాది మరో రెండు మిలియన్ డాలర్ల జీతాన్ని పెంచుతామని అల్ఫాబెట్ పేర్కొంది. గతేడాది చివర్లో లారీపేజ్ కంపెనీ సీఈవో పదవి నుంచి తప్పుకొని.. ఆ బాధ్యతలను పిచాయ్ కు అప్పగించాడు. కంపెనీ కో–ఫండర్ సెర్జీ బ్రిన్ సంస్థను వీడిన సంగతి తెలిసిందే.