
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 26 నుంచి 30 వరకు మోడల్ ఎంసెట్, మోడల్ నీట్ నిర్వహించనున్నట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు తెలిపారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టెస్ట్‌లకు సంబంధించిన వాల్ పోస్టర్లను వారు విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 18 ఏండ్లుగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలు.. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల్లో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో టెస్ట్‌లు పెడుతున్నట్టు చెప్పారు. టాప్ టెన్ స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ ఇస్తామన్నారు. వివరాలకు 9490098292, 8247672658 నంబర్లను సంప్రదించాలని కోరారు.