
శ్రావణమాసం మొదలైంది. శ్రావణమాసంలో ప్రతి రోజుకు విశిష్టత ఉంటుంది. ఈ నెలలో మద్యం.. మాంసానికి దూరంగా ఉండాలి. కాని మనోళ్లు ఆదివారం వస్తే చాలు.. చికెన్ షాపుల దగ్గర.. బార్ షాపుల్లో ప్రత్యక్షమవుతారు. కొంతమందైతే ఇంటినే బార్ గా మారుస్తారు. అసలు ఆదివారం అలాంటి పనులకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అసలు సండే రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
ఆదివారం వచ్చిందంటే చాలు.. జనాలకు ఎక్కడలేని బద్దకం వస్తుంది. కాని ఆధ్యాత్మికంగా ఆరోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఆదివారం ఖాళీ సమయం ఎక్కువుగా ఉంటుంది. ఆ సమయంలో భగవంతుడిని ధ్యానం చేయాలని అంటున్నారు.
ప్రత్యక్షదైవం సూర్యభగవానుడికి ఆదివారం ఎంతో ఇష్టమైన రోజు. అంతేకాదు సూర్యుడు పుట్టినరోజు కూడా ఆదివారమే. పురాణాల ప్రకారం సన్ డేకు సనాతన ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం జరుపుకునే పండుగలను సూర్యుడి గమనాన్ని ఆధారంగానే.. .. సౌరమానం ప్రకారం నిర్ణయిస్తారు.
Also read:-శ్రావణమాసం మొదలైంది... ఈ పనులు అస్సలు చేయొద్దు..
బ్రహ్మ ముహూర్తంలో అంటే ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటివి చేసే ఆచారం మన భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఉంది. సూర్యుడిని ప్రార్థించడం ద్వారా ఆరోగ్యం కూడా కలుగుతుంది.
ఆదివారం చేయకూడని పనులివే..!
- సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం రోజు కొన్ని పనులు అస్సులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం చేయడం, క్షవరం చేసుకోవటం చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
- ఆదివారం రోజున తలకు నూనె పెట్టుకోకూడదు.
- తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకొని సూర్య నమస్కారాలు చేయాలి
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా సండే అంటే ఫన్ డే గా మారిపోయింది. ఇక ఆరోజు అందరికి సెలవు కావడంతో రెస్ట్ తీసుకొని రిలాక్స్ కావడానికి దీనిని మంచి రోజుగా భావించి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా మంది నిద్రపోతున్నారు. ఇక చాలా మంది తమ ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటున్నారు. ఖాళీ దొరికిందని నూనె పెట్టి తలస్నానం చేస్తున్నారు. ఏ పనులు అయితే చేయకూడదో అదే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివారం ఈ పనులు చేయకుండా ఉంటే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.