నవీపేట్​కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరిక

నవీపేట్​కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరిక

నవీపేట్, వెలుగు: నవీపేట్​కు చెందిన పలువురు యువకులు ఆదివారం బీజేపీలో  చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాశ్​రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభావితమై పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ గెలుపునకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో లీడర్లు రాజేందర్, చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.