సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు సంజయ్ జాసన్ రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు మేకర్స్. అనుకున్న షెడ్యూల్ కంటే ముందే మొత్తం చిత్రీకరణను పూర్తి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో షూటింగ్ మొదలైన రోజు నుంచి సెట్ వర్క్స్ ఎలా జరిగాయి, నటీనటుల సందడిని చూపించారు. దీంతోపాటు టీజర్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 23న సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రాజు సుందరం, అన్బు థాసన్, సంపత్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, కేథరిన్ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నారు.
