సునీల్ ముఖంలో బాధతో కూడిన భయం...

సునీల్ ముఖంలో బాధతో కూడిన భయం...

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జిన్నా. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలో  సునీల్ క్యారెక్టర్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

పెంచలయ్య గా సునీల్..
జిన్నా మూవీలో సునీల్ పెంచలయ్యగా కనిపించనున్నారు. ఈ పాత్రలో  సునీల్ కమెడియన్ గానే సందడి చేయబోతున్నాడని  పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది.  పెళ్లి కొడుకు లుక్ తో ఉన్న సునీల్ లో బాధతో కూడిన భయం కనిపిస్తోంది. ఈ చిత్రంలో సునీల్తో పాటు..నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

సొంత బ్యానర్లో...
జిన్నా మూవీని మంచు విష్ణు సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి కథను అందించారు.  కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. . AVA ఎంటర్టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జిన్నా మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో అక్టోబర్ 21న విడుదల కానుంది.