
రంగారెడ్డి జిల్లా: ఆర్టీసీ డిపో మేనేజర్ లు, జిల్లా అధికార యంత్రాంగంతో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ వీడియో కాన్ఫిరెన్స్ముగిసింది. రేపు(గురువారం) RTC కార్మికులు డిపో ల ముందు ధర్నాకు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలను రంగంలోకి దింపాలని సునీల్ శర్మ ఈ కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి ప్రస్తుతం 50% బస్సులు మాత్రమే నడుస్తున్నాయని, అదనంగా బస్సులు నడపాలని ఆదేశించారు. దసరా సెలవులు ఈ నెల 13 న ముగిసి, 14 నుంచి పాఠశాలలు రీ ఓపెన్ అవుతుండడంతో…విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పండుగకు ఊళ్ళకు వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారు కాబట్టి వారికీ ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని అధికారులను అదేశించారు.