
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ (Sunny leone)పేరుకు మంచి ఫాల్లోవింగ్ ఉంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మూవీస్, షోస్, ఐటెం సాంగ్స్ చేసి క్రేజీ ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది. తెలుగులో కరెంట్ తీగ, రాజశేఖర్ PSV గరుడవేగా, మంచు విష్ణు జిన్నా మూవీస్లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ.. మళ్ళీ కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
సన్నీలియోన్ నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘త్రిముఖ’. ఈ సినిమాలో సన్నీలియోన్‌తో పాటు యోగేష్ కల్లే, అకృతి అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే త్రిముఖ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ALSO READ : KINGDOM OTT: కళ్లు చెదిరే రికార్డు ధరకు ‘కింగ్‌డమ్’ ఓటీటీ హక్కులు.. దేవరకొండ కెరీర్లోనే హయ్యెస్ట్!
ఇటీవలే ‘గిప్పా గిప్పా’ అనే ఐటం సాంగ్ ఇటీవలే గ్రాండ్‌గా షూట్ పూర్తయింది. ఈ పాటలో సన్నీ లియోన్తో పాటు సాహితీ దాసరి (పొలిమేర ఫేమ్) మరియు ఆకృతి అగర్వాల్ వంటి క్రేజీ భామలు చిందేసారు. ఈ పాటకు భారీ బడ్జెట్ కేటాయించడంతో పాటు, 10 మందికి పైగా సినీ ప్రముఖులు డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఐటం సాంగ్ పోస్టర్స్.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్నాయి. చెప్పాలంటే ఈ పాటతో సౌండ్ బాక్సులు మోత మోగటం కన్ఫార్మ్ అనేలా సన్నీ ఇన్ డైరెక్ట్ హింట్ ఇస్తుంది!
ఇకపోతే ఈ సినిమాను రాజేష్ నాయుడు తెరకెక్కించారు. డాక్టర్ శ్రీదేవి మద్దాలి మరియు డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు నిర్మాతలు.