KINGDOM OTT: కళ్లు చెదిరే రికార్డు ధరకు ‘కింగ్‌డమ్’ ఓటీటీ హక్కులు.. దేవరకొండ కెరీర్లోనే హయ్యెస్ట్!

KINGDOM OTT: కళ్లు చెదిరే రికార్డు ధరకు ‘కింగ్‌డమ్’ ఓటీటీ హక్కులు.. దేవరకొండ కెరీర్లోనే హయ్యెస్ట్!

తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ఒకటి. విజయ్ దేవరకొండ నటించిన ఈ మూవీ జూలై 31, 2025న విడుదల కానుంది. పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు.

ఈ యాక్షన్ డ్రామా కోసం సుమారు రూ.130 కోట్లు ఖర్చు చేశారు మేకర్స్. ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేయడం విజయ్కి ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే మంచి రికార్డ్ సొంతం చేసుకుంది.

కింగ్‌డమ్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందనే టాక్ బయటకి వచ్చింది. అందుకు నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.53 కోట్లకి కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇది విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యధికం కావడం విశేషం.

అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న విజయ్ తో ఇంత భారీ బడ్జెట్ తో సినిమా తీయడం ఒకటైతే.. నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకోవడం మరొకటి. సినిమాపై ఈ స్థాయిలో అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుందనే సందేహం అందరికీ కలిగే ఉంటుంది. అందుకు ముఖ్య కారణం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రాసుకున్న ‘కథే’అని సినీ క్రిటిక్స్ అంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు.

►ALSO READ | Rana Daggubati : శివకార్తికేయన్ 'పరాశక్తి'లో రానా? రాజకీయ డ్రామాలో పాత్రపై ఉత్కంఠ!

మళ్లీ రావా, జెర్సీ సినిమాల్లో ఎమోషనల్‌‌ కంటెంట్‌‌తో మెప్పించారు గౌతమ్.  2019లో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చిన నాని జెర్సీ భారీ విజయాన్ని సాధించి, ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది. ఒక్కో సీన్ చార్ట్ బ్లాస్టర్ టాక్తో సినిమా విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అనుభూతి ఉంది.

అలాంటి సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ నుంచి ‘కింగ్‌డమ్’వస్తుండటం విశేషం. అందుకు నిదర్శనమే ఈ కింగ్‌డమ్ సాధిస్తున్న అంచనాలని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే, కింగ్‌డమ్ ట్రైలర్ రేపు సాయంత్రం విడుదల కానుంది. 

  • Beta
Beta feature